Sarpanch | ప్రజాసేవే నా లక్ష్యం..

Sarpanch | ప్రజాసేవే నా లక్ష్యం..
- ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చాను
- ఆశీర్వదించి ఓటు వేయండి
- సర్పంచ్ అభ్యర్థి దేవి వినోదా భూమయ్య
Sarpanch | మల్హర్, ఆంధ్రప్రభ : మీ ఇంటి ఆడబిడ్డగా ముందుకు వచ్చా.. ఆశీర్వదించి ఓటు వేయండి.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని సర్పంచ్ అభ్యర్థి దేవి వినోదా భూమయ్య అన్నారు. ఈ రోజు మండలంలోని కొయ్యూరు పీవీ నగర్, శాలపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజాసేవే లక్ష్యమని, అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొయ్యూరు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రధాన రహదారిపై డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, మురికి కాలువలను మరమ్మతు చేయిస్తానన్నారు. గ్రామంలో కుక్కలు, కోతుల బెడద నుంచి విముక్తి మార్గాన్ని ఎంచుకుందామని అన్నారు. ఓటర్లు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు
