Ameerpet | కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

Ameerpet | కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
Ameerpet | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో (Ameerpet) మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించి స్థానికంగా ఆందోళన నెలకొంది. మైత్రీవన ప్రాంతంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్రమత్తమైన అధికారులు సమీపంలోని పలు కోచింగ్ సెంటర్ల నుంచి విద్యార్థులను బయటకు పంపి జాగ్రత్త చర్యలు చేపట్టారు.
