Bhutpur | సర్పంచ్ గా గెలిపించండి..

Bhutpur | సర్పంచ్ గా గెలిపించండి..

  • పునరావాసం కోసం కృషి చేస్తా
  • భూత్పూర్ సర్పంచ్ అభ్యర్థి సంగీత శేఖర్ గౌడ్


Bhutpur | మక్తల్, ఆంధ్రప్రభ : సర్పంచిగా తనను గెలిపించండి.. పునరావాస‌ కేంద్రం ఏర్పాటు కోసం కృషి చేస్తానని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సంగీత శేఖర్ గౌడ్ అన్నారు. దశాబ్ద కాలంగా గత పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల పునరావాస కేంద్రం ఏర్పాటు కాలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పునరవాస కేంద్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పునరావాసం సాధ్యమన్నారు. గతంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాల్సిన గ్రామాన్ని అప్పటి పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకు తనను సర్పంచ్ గా గెలిపించవలసిందిగా సంగీత శేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply