ఆదరించండి… అభివృద్ధి చేసి చూపిస్తా..

ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని పిప్రి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి కోరేంగా సుంగు, గ్రామ ప్రజలు ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈసారి ఎన్నికల్లో తన గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీలతో గెలిపించాలని కోరారు.
తనకున్న పరిచయాలు, నేతలతో ఉన్న అనుబంధం ద్వారా గ్రామానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఇతిపూర్వం గ్రామ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టానని, ప్రజల ఆదరణతోనే తన విలువైన ఉద్యోగాన్నికూడా త్యాగం చేసినట్లు సుంగు పేర్కొన్నారు.
