Srilatha | అభ్యర్థి శ్రీలత ప్రచార హోరు
- జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో
- 2 కి.మీ మేర సాగిన ప్రదర్శన
- పటిష్ట బందోబస్తు ఏర్పాటు
Srilatha | ఏటూరు నాగారం, ఆంధ్రప్రభ : ఎన్నికల ప్రచారానికి ఇవాళ చివరి రోజు కావడంతో ఏటూరునాగారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తమ బలప్రదర్శనను భారీ ర్యాలీతో చాటుకుంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీలత, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబుల ఆధ్వర్యంలో ఈ భారీ ప్రదర్శన నిర్వహించారు.ఓడవాడ ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో సుమారు 2వేల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇతర మండలాల నుంచి కూడా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ర్యాలీలో భాగమయ్యారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు బస్టాండ్ దాకా ఈ ప్రదర్శన కొనసాగింది. కార్యకర్తల భారీ సంఖ్యతో ఏటూరునాగారం వీధులు కిక్కిరిసిపోయాయి. ఎన్నికల కోడ్ దృష్ట్యా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రచారం చివరి రోజు కావడంతో నాయకులు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నం చేశారు.

