Candidate | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని భగీరత్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంతోష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గల ఎయిర్ కటింగ్ షాపుల్లోకి వెళ్లి అక్కడ పలువురికి కటింగ్ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. తమను గ్రామ సర్పంచుగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఆయన నిర్వహించిన వినూత్న ప్రచారానికి విశేష స్పందన లభించింది. గ్రామస్తులందరూ ఆయనకు అండగా నిలుస్తున్నారు.
Candidate | కటింగ్ చేస్తా.. ఓటు వెయ్..

