Main Party | పంచాయ‌తీ అభివృద్ధికి నిరంత‌రం కృషి

Main Party | పంచాయ‌తీ అభివృద్ధికి నిరంత‌రం కృషి

  • సర్పంచ్ అభ్యర్థి అనిత శ్రీనివాస్ జాదవ్

Main Party | ఉట్నూర్, ఆంధ్ర‌ప్ర‌భ : పంచాయతీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అనిత శ్రీనివాస్ జాదవ్ అన్నారు. ఆమె ప్రజలతో మాట్లాడుతూ రాజకీయపరం(political)గా సేవలు చేయాలని ఉద్దేశంతో సర్పంచ్ గా బరిలో దిగానని, తన కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థ ద్వారా గత ప‌దేళ్లుగా విద్యా ఆరోగ్య వ్యవసాయ పరంగా సేవలందిస్తున్నారని తెలిపారు.

తనను గెలిపిస్తే ఉట్నూర్ పంచాయతీలో సెంట్రల్ లైటింగ్‌(Central Lighting)కు కృషి చేస్తానని, ప్రజలకు మినరల్ ప్లాంట్ ఏర్పాటు కృషి చేస్తానని, పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల లో భాగంగా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ(Main Party)ల అభ్యర్థులకు దీటుగా స్వతంత్ర అభ్యర్థి అనిత శ్రీనివాస్ జాదవ్ ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తున్నారు.

Leave a Reply