BRS PARTY | ఏకగ్రీవ సర్పంచులకు మాజీ ఎమ్మెల్యే సన్మానం

BRS PARTY | ఏకగ్రీవ సర్పంచులకు మాజీ ఎమ్మెల్యే సన్మానం
BRS PARTY | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ (BRS PARTY) జిల్లా అధ్యక్షుడు యస్. రాజేందర్ రెడ్డి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం నారాయణపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.
దామరగిద్ద మండలం బాపన్ పల్లి గ్రామ సర్పంచ్‌గా గవినోళ్ళ శ్రీనివాస్, నారాయణపేట మండలం ఊటకుంట తండా సర్పంచ్‌గా వెంకట్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కావడంతో, పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే (Ex Mla) వారిని సన్మానించారు. ఈసందర్భంగా యస్.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేసి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్ధతతో పని చేసి తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
