DCGA ORDER : షెడ్యూల్​  తగ్గించండి

DCGA ORDER : షెడ్యూల్​  తగ్గించండి

ఇండిగోకు డీజీసీఏ ఆదేశం

( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ )

తీవ్ర సంక్షోభంలో .. ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఇండిగో విమానయాన సంస్థకు డీజీసీఏ మరో షాక్​ ఇచ్చింది. ఇండిగో విమానాల రాకపోకల షెడ్యూల్​ లో.. 5 శాతం కోత విధించాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5.00 గంటలు (డిసెంబర్​ 10)లోపు తమ నివేదికను సమర్పించాలని విమానయాన పర్యవేక్షణ  సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

ఇండిగో విమానాల షెడ్యూల్‌ను 5 శాతం లేదా   115  రోజువారీ విమానాలను సంఖ్యను  తగ్గించాలని డీజీసీఏ నిర్ణయించింది, ముఖ్యంగా అధిక డిమాండ్,  అధిక -ఫ్రీక్వెన్సీ మార్గాల్లో ఈ కోత విధించాలని డీసీజీఏ వర్గాలు తెలిపాయి. తదనుగుణంగా విమానయాన సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. ఇక  తగ్గించాల్సిన విమానాలను ఖరారు చేస్తున్నామని, మొత్తం ఎయిర్ కనెక్టివిటీ  జరిగే మార్గాలపై గణనీయంగా ప్రభావం చూపకుండా కోతలు విధిస్తామని ఇండిగో స్ఫష్టం చేసింది. అదనపు సామర్థ్యం కలిగిన  ఇతర క్యారియర్‌లకు ఈ స్లాట్‌లను అప్పగించవచ్చని ఇండిగో స్ఫష్టం చేసింది.

భారతదేశంలోనే ఇండిగో  అతిపెద్ద విమానయాన సంస్థ, దీని దేశీయ మార్కెట్ వాటా దాదాపు 65 శాతం, రోజువారీ  షెడ్యూల్‌లో  2,300  కంటే  విమానాలు తిరుగుతున్నాయి. వీటిలో దాదాపు 2,150 దేశీయ విమానాల  షెడ్యూల్‌లో  14,158 వారాంతపు విమానాల సంఖ్య    శీతాకాల షెడ్యూల్‌లో  5,014కి పెరిగాయి.

Leave a Reply