Jainur | అభివృద్ధి చేస్తా.. ఆదరించండి..

Jainur | అభివృద్ధి చేస్తా.. ఆదరించండి..
- దుబ్బగూడ సర్పంచ్ అభ్యర్థి కౌసల్య భీమ్రావు
Jainur | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ పంచాయతీ గత ఎన్నికల్లో దుబ్బగూడ పంచాయతీ సర్పంచ్‌గా తన భర్తను ప్రజలు ఆదరించి గెలిపించారని మడావి కౌసల్య భీమ్రావు తెలిపారు. తన భర్త పంచాయతీ అభివృద్ధి ఎంతో కృషి చేశారని, ఈసారి పంచాయతీ ఎన్నికల్లో దుబ్బగూడ పంచాయతీ సర్పంచ్ మహిళా రిజర్వేషన్ కావడంతో తాను బరిలో దిగానని చెప్పారు. ఈ రోజు ఆమె తన భర్తతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే అందుబాటులో ఉండి పంచాయతీ ప్రజలకు సేవలందిస్తానని, అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి మడవి కౌసల్య భీమ్రావు ప్రజలకు హామీ ఇచ్చారు. తన భర్త అండదండలతో పంచాయతీ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజలకు మౌలిక సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
