MOVIE | ఆ ఇద్దరి స్టార్స్ లో.. లోకేష్ మూవీ ఎవరితో..?

MOVIE | ఆ ఇద్దరి స్టార్స్ లో.. లోకేష్ మూవీ ఎవరితో..?
MOVIE | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ లో వరుసగా సక్సెస్ సాధిస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్న సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన కూలీ (Coolie) సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో లోకేష్ నెక్ట్స్ ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది. రజినీ, కమల్ కాంబో మూవీని లోకేష్ డైరెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ.. ఆతర్వాత అందులో వాస్తవం లేదని తెలిసింది. కార్తీతో ఖైదీ 2 తెరకెక్కిస్తాడని ప్రచారం జరిగింది. అయితే.. ఇది కూడా నిజం కాదని టాక్ వినిపిస్తోంది. మరి.. లోకేష్ నెక్ట్స్ ఏంటి అంటే.. ఇద్దరి స్టార్స్ పేర్లు తెర పైకి వచ్చాయి. ఇంతకీ.. ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు..?
కూలీ సినిమా ప్లాప్ అవ్వడంతో.. లోకేష్ తో సినిమా చేయడానికి కోలీవుడ్ స్టార్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. అందుకనే అనుకుంటా.. లోకేష్ (Lokesh) తమిళ హీరోలతో కాకుండా వేరే హీరోలతో సినిమా చేయడం కోసం ట్రై చేస్తున్నారు. కూలీ సినిమా టైమ్ లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఈ క్రేజీ కాంబో మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం మొదలైంది. తాజాగా అమీర్ ఖాన్ ను బాలీవుడ్ మీడియా లోకేష్ మూవీ గురించి అడిగితే.. ఈ ప్రాజెక్ట్ ఆన్ లోనే ఉందని.. ఇటీవల లోకేష్ తనతో మాట్లాడాడని.. త్వరలో ఫుల్ స్క్రిప్ట్ చెబుతాను అన్నాడనే విషయం బయటపెట్టారు.

ఇదిలా ఉంటే.. లోకేష్ ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసాడని.. ఓ స్టోరీ ఐడియా చెప్పాడని తెలిసింది. అది సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందే సినిమా అని.. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండే సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ.. అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ (Bollywood) బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. భారీ బడ్జెట్ తో.. భారీ పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ను బన్నీ ఏప్రిల్ లేదా మే నెలలో కంప్లీట్ చేస్తాడట. ఆతర్వాత నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడని టాక్.
లోకేష్.. ఓ వైపు డైరెక్షన్ చేస్తూనే కొత్తగా హీరోగా (Hero) నటించేందుకు ఓకే చెప్పడం విశేషం. దీంతో లోకేష్ హీరోగా కంటిన్యూ అవుతాడా..? డైరెక్షన్ కు గ్యాప్ తీసుకుంటాడా..? అనే డిష్కసన్ జరుగుతుంది. అయితే.. ఈ కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మాత్రం హీరోగా నటించినా డైరెక్షన్ కి మాత్రం గ్యాప్ ఇచ్చేదేలా అంటున్నాడని టాక్. దీంతో లోకేష్ నెక్ట్స్ మూవీ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో ఉంటుందా..? టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తో ఉంటుందా..? అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా.. క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

