Tsunami in Japan | ఫసిఫిక్ తీరంలో భయం భయం

Tsunami in Japan | ఫసిఫిక్ తీరంలో భయం భయం
- జపాన్ లో భారీ భూకంపం..
- రెక్టర్ స్కేలుపై 7.5 నమోదు
- 23 మందికి గాయాలు..
- 800 ఙళ్లల్లో అంధకారం
- బుల్లెట్ రైళ్లు రద్దు
- ఫసిఫిక్ తీరంలో సునామీ అలజడి
న్యూస్ నెట్ వర్క్, ఆంధ్రప్రభ : ఇటు భారీ భూకంపం.. అటు సునామీ హెచ్చరికలతో జపనీయుల్లో కలవరం సృష్టించాయి. ఉత్తర జపాన్‌లో సోమవారం సాయంత్రం రెక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో (Earth Quake) భూకంపం నమోదైంది. ఈ దుర్ఘటనలో 23 మంది (23 Injured) గాయపడ్డారు. భూకంపం తర్వాత పసిఫిక్ తీరప్రాంతాల్లో సునామీ (Tsunami) సంభవించింది. మరిన్ని భూ ప్రకంపనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ సంస్థ, ఆ తర్వాత సునామీ తీవ్రతను హెచ్చరికగా స్పష్టం చేసింది.
Tsunami in japan | భారీ భూకంపమే .. కానీ

జపాను ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన ప్రకారం, జపాన్‌లోని హోన్షు (Hosnshu Island) ప్రధాన ద్వీపంలోని అమోరి ప్రిఫెక్చర్ (Amori East Coast) తూర్పు తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ కాలమానం ప్రకారం సోమవారం (08.12.2025) రాత్రి 11:15 గంటలకు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఆ తర్వాత భూకంప తీవ్రత 7.5గా ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో 3 మీటర్ల (10 అడుగులు) వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసినప్పటికీ తరువాత తీవ్రత తగ్గించారు.
Tsunami in japan | సునామీ అలజడి..

అమోరీకి దక్షిణ ప్రాంతంలోని ఇవాటే (Ivate) ప్రిఫెక్చర్‌లోని (అధికార పరిధి) కుజి ఓడరేవులో 70 సెంటీమీటర్ల (2 అడుగులు 4 అంగుళాలు) ఎత్తులో (70 Centi metres) అలలు ఎగసిపడి సునామీ సంభవించిందని… ఈ ప్రాంతంలోని ఇతర తీర ప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల ఎత్తులో అలలు (Waves) ఎగసిపడినట్టు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
ఈ భూకంపం వల్ల 23 మంది గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉందని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వారిలో ఎక్కువ మంది పడిపోతున్న వస్తువుల వల్ల గాయపడ్డారని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే రిపోర్టు స్పష్టం చేసింది. హచినోహేలోని ఒక హోటల్‌లో చాలా మంది గాయపడ్డారని, తోహోకులోని ఒక వ్యక్తి కారు నేల బొరియలో పడటంతో స్వల్పంగా గాయపడ్డారని తెలిపింది. భూకంప తీవ్రత (Earth Quake Effect) 7.5గా ఉందని వాతావరణ సంస్థ నివేదించింది.
Tsunami in japan | రక్షణ చర్యల్లో బిజీబిజీ

ప్రధాన క్యాబినెట్ కార్యదర్శి మినోరు కిహారా (Minoru Khara) మాట్లాడుతూ… ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని, హెచ్చరికలను నిలుపదల చేసే వరకు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. దాదాపు 800 ఇళ్లకు విద్యుత్ (800 Houses ) సరఫరా నిలిచిపోయింది, (Electricity Cut) ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో షింకన్‌సెన్ బుల్లెట్ రైళ్లు, కొన్ని స్థానిక లైన్‌లను రద్దు చేశారు.

ఈ ప్రాంతంలోని అణు విద్యుత్ ప్లాంట్లు (Checked Atomic Power Flants) భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హచినోహే వైమానిక స్థావరంలో దాదాపు 480 మంది ఆశ్రయం పొందుతున్నారు. నష్ట అంచనాలకు 18 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. హొక్కైడోలోని న్యూ చిటోస్ (New Chitos Air Port) విమానాశ్రయంలో రాత్రికి దాదాపు 200 మంది (200 people Stucked) ప్రయాణికులు చిక్కుకుపోయారు. జపాన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
CLICK HERE TO READ Earth Quake In Nepal : నేపాల్‌లో భూకంపం
