రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాల మీద సినిమాలను ఒప్పుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో రాజా సాబ్, హను రాఘవపూడి మూవీ, స్పిరిట్ వంటి చిత్రాలతో పాటు సాలార్, కల్కి సీక్వెల్స్ ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని అనుకుంటే, డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాని లైన్ లో పెట్టాడు.
‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ రేపు ప్రభాస్ లుక్ టెస్ట్ చేయబోతున్నాడు. లుక్ టెస్ట్ పూర్తయిన తరువాత సినిమా ముహూర్తం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి ‘బ్రహ్మ రక్షణ’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.