Collector | తక్షణమే పరిష్కరించండి

Collector | తక్షణమే పరిష్కరించండి
- కలెక్టర్ తో బాధితుడు వాగ్వాదం
Collector | మచిలీపట్నం,- ఆంధ్ర ప్రభ : మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో ఈ రోజు బంటుమిల్లి మండలం జయపురం గ్రామానికి చెందిన సబ్బిశెట్టి పద్మావతి , సబ్బిశెట్టి వెంకట మదన్ కుమార్ లు జిల్లా కలెక్టర్ కు తమ సమస్యపై ఫిర్యాదు చేయడానికి వచ్చారు.
బాధితుల చెరువు సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్(Collector) హామీ ఇచ్చినప్పటికీ.. మదన్ కుమార్ తన దుడుకుతనంతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. తన పొలం సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆవేశంతో అరుస్తూ ఊగిపోయాడు. అధికారులు(officials) చెప్పిన వినకుండా వాగ్వాదంకు దిగడం ఒక్కసారిగా అక్కడున్న అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తో వాగ్వాదం చేస్తూ విధులకు ఆటంకం కలిగించాడు. నిమిషాల ప్రకారం సమస్యను పరిష్కరించాలని బాధితుడు చెప్పడం తీవ్ర విమర్శలకు గురైంది. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన పోలీసులు(police) అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని తెలుస్తోంది. దీనిని ఆసరాగా తీసుకొని మీకోసం కార్యక్రమం కు వచ్చే మరి కొంతమంది అధికారులతో ఘర్షణకు దిగే అవకాశం కూడా లేకపోలేదు.
