elections | ఒక్కసారి గెలిపించండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా.
elections | దండేపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో(elections) సర్పంచ్‌గా ఒక్కసారి గెలిపించండనీ, నాగసముద్రం గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఇంటింటా ప్రచారంలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి నందుర్క సుగుణక్క హామీల వర్షం కురిపిస్తోంది.
ఈ రోజు దండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామంలో కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్లు(CC roads), కరెంటు, త్రాగునీరు, పాఠశాల వసతులు, మరుగుదొడ్లు, డ్రైనేజీలు వంటి పనులు చేసి చూపిస్తానని అన్నారు. గ్రామ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా దిద్దుతానని కోరారు.

