Tandoor | బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి

Tandoor | బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి
ఓటర్లను అభ్యర్థించిన బీజేపీ రాష్ట్ర నేత కొయ్యల ఏమాజి
Tandoor | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, న్యాయవాది కొయ్యల ఏమాజి ఓటర్లను అభ్యర్తించారు. ఇవాళ తాండూరు మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంబాల తిరుపతి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేశారు.
ఈసందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ… గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేస్తున్నదని తెలిపారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఇంకా త్వరగా అభివృద్ధి చెందాలని ఉంటే బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు పులగం తిరుపతి, శేషగిరి, పుట్ట కుమార్, తాండూరు సర్పంచ్ అభ్యర్థి కంబాల తిరుపతి, విజయ్ కుమార్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
