Local Elections | తండాను అభివృద్ధి చేస్తా..

Local Elections | తండాను అభివృద్ధి చేస్తా..

Local Elections | పెద్దవంగర, ఆంధ్రప్రభ : రామచంద్రు తండా గ్రామ సర్పంచ్ గా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాటోత్ వెంకన్న వేడుకొన్నారు. అదేవిధంగా 3వ వార్డు(3rd Ward) గౌను గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని జాటోత్ అమల సక్రు వాడవాడలా జోరుగా తిరుగుతూ ఈ రోజు ప్రచారం చేపట్టారు.

స్థానిక ఎన్నికల(Local Elections) ప్రచారం వేళ రామచంద్రు తండా బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ అభ్యర్థి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. జాటోత్ వెంకన్న వారిని కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a Reply