Vote | బిక్కనూర్,ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా, బిక్కనూర్ మండలంలోని భగీరథ పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లెర్ల సంతోష్ కుమార్ గుప్తాకు ఓటర్లు మద్దతుగా నిలిచారు. గ్రామంలో ఆయన చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. ఇంటింటికీ తిరుగుతూ తమను సర్పంచిగా గెలిపించాలని ఆయన కోరారు. దీంతో ఓటర్లు సైతం గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. అనంతరం సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. తమపై నమ్మకంతో గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Vote | సంతోష్ కుమార్‌కు పెరిగిన మద్దతు

