ఒక్క అవకాశం ఇవ్వండి..గ్రామాభివృద్ధి చేసి చూపిస్తా

  • ఒకటోవ నెంబర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి
  • సర్పంచ్ అభ్యర్థి మారపాక కవిత మనోహర్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామాభివృద్ధి చేసి చూపిస్తాను… డిసెంబర్ 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో 1వ నెంబర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అవకాశం కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మారపాక కవిత మనోహర్ ఈ సందర్బం గా గ్రామ ప్రజల మద్దతు కోరారు.

శనివారం మండలంలోని తాటికొండ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ గా గెలిపించి ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను కోరుకున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను.

స్వచ్చమైన గ్రామం కోసం ప్రత్యేక కార్యక్రమా లు అమలు చేస్తాను. ప్రతి రోజూ నీటి సరఫరా కోసం చర్యలు తీసుకుం టాను. వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షిస్తూ ఇబ్బందులు రాకుండా చూస్తాను.

గ్రామంలోని ప్రతి వీధికి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కు కృషి చేస్తాను. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు ప్రాధా న్యతతో అందేలా చూస్తాను. యువత క్రీడా ప్రోత్సాహానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాను. గ్రామ సమస్యలపై తక్షణమే స్పందిస్తాను. పక్ష పాతం లేకుండా పారదర్శక పాలన అందిస్తానని మారపాక కవిత మనోహర్ తెలిపారు.

Leave a Reply