- సర్పంచ్ అభ్యర్థికొత్త దర్మయ్య.
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. శనివారం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన ఆయన, ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని పరిష్కరించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ధర్మయ్య తెలిపారు. ప్రజలు తనకు ఆశీర్వాదం అందించి భారీ మెజార్టీతో గెలిపిస్తే, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో గ్రామానికి కావాల్సిన నిధులను తెచ్చి మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని ధర్మయ్య ప్రకటించారు. కార్యకర్తలతో కలిసి ఆయన నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి గ్రామస్థులు మంచి స్పందన చూపారు.

