అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చుస్తా

  • సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి
  • చిల్వకోడూరు సర్పంచ్ అభ్యర్థి దాసరి తిరుపతి

గొల్లపల్లి, ఆంధ్ర‌ప్రభ : అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చుస్తాన‌ని, సర్పంచ్ గా అవకాశం ఇవ్వాల‌ని, గ్రామానికి సేవకుడిలా పనిచేస్తానని చిల్వకోడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి దాసరి తిరుపతి అన్నారు. శనివారం గ్రామంలోని పలువురిని కలిసి ఇంటింట ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్తించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ… పలు సేవకార్యక్రమాలు చేసిన అనుభవంతో గ్రామంలో ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిని అధికారులతో చ‌ర్చించి పరిష్కరించే దిశగా గ్రామంలోని పలు సంఘాల నాయకులు, మహిళా సంఘాల, గ్రామస్తుల సలహాలు సహకారంతో ముందుకు సాగుతామని, గ్రామాభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యక్రమాలు, గ్రామ రహదారులు, శుద్ధి చేసిన తాగునీటి సరఫరా, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చుడటం,యువతకు ఉపాధి అవకాశాలు, క్రీడా మౌలిక వసతులు, పాఠశాల,అంగన్వాడీల అభివృద్ధి, మహిళల శ్రేయస్సు కోసం ప్రత్యేక చర్యలు, శాంతి భద్రత కమిటీల ఏర్పాటు, ప్రజల సమస్యలకు గళమెత్తే నాయకుడిగా ముందుటామన్నారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, యువత సహకారాన్ని అందించి గెలిపించాలని తిరుపతి అన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply