రాయపట్నంను అభివృద్ధి పథంలో నడిపిస్తా..

ధర్మపురి, ఆంధ్రప్రభ : రాయపట్నం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాయపట్నం సర్పంచ్ గా తనకు అవకాశం కల్పించాలని సర్పంచ్ అభ్యర్థి రందేని మోగిలి ఓటర్లను అభ్యర్థించారు.

శనివారం రాయపట్నం గ్రామంలో పలు వార్డులలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అండతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి అత్యధికంగా నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని ఒక్క‌సారి గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజలకు కల్పించాలని అభ్యర్థించారు. ప్రతి నిత్యం అందుబాటులో వుంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply