Parade | శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర ముఖ్యమైంది..

Parade | శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర ముఖ్యమైంది..

  • జిల్లాలో హోంగార్డ్‌ల పనితీరు ప్రశంసనీయం
  • అడిషనల్ ఎస్ పి ఎన్. వెంకటేశ్వర్లు

Parade | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : నాగర్ కర్నూల్ జిల్లాలో 63వ హోంగార్డు రైసింగ్ డే వేడుకల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. హోం గార్డ్ సిబ్బంది 63వ రైజింగ్ డే సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు.

ఈ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ ప్రోగ్రాంలో భాగంగా అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… జిల్లాలో హోంగార్డుల పనితీరు బాగుందని ప్రశంసించారు. జిల్లాలో మొత్తం 175 మంది హోంగార్డులు ఉన్నారని మంచి పనితీరును కనబరిచిన వారికి ప్రశంస పత్రాలు అందించడంతో పాటు వారు హోంగార్డు దినోత్సవం సందర్భంగా క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది.

అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ నుండి హోంగార్డులకి కూడా ఇన్సూరెన్స్ లతో పాటు యూనిఫామ్ అలవెన్స్ ఇస్తున్నామని. అలాగే హోంగార్డ్ సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం ఇటీవలే యాక్సిస్ బ్యాంక్ బ్యాంకుతో సంప్రదింపులు జరిపామని త్వరలోనే సిబ్బంది.. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిఎస్పి శ్రీనివాసులు,సిఐ అశోక్ రెడ్డి, ఆర్ ఐ జగన్, రాఘవరావు,ఎస్సై గోవర్ధన్, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్ఎస్ఐ గౌస్ పాషా,ప్రశాంత్, కళ్యాణ్,శివాజీ లతోపాటు హోంగార్డ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave a Reply