- సపావత్ అచ్చమ్మ
సీరోల్, ఆంధ్రప్రభ : తనను ఆదరిస్తే… మండలంలోని మోదుగుగడ్డ తండా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తానని సపావత్ అచ్చమ్మ తెలిపారు. మండలంలోని మోదుగుగడ్డతండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయతీగా అభివృద్ధి పరుగులు తీస్తుందని తెలియజేశారు.
గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగాఅచ్చమ్మ ని ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని గ్రామ పాలనకు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతుందని గ్రామాల అభివృద్దే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని పేర్కొన్నారు.

