JAC | ఆటో డ్రైవర్ల మహాసభ
JAC | బోధన్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై వర్ని మండల కేంద్రంలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు. ఎన్నికల (Election) సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆటోలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి నెలా ఆటో డ్రైవర్లకు రూ.12,000 ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ (Demand) చేస్తూ ఈనెల 9వ తేదీన వర్ని మండల కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు యూనియన్ జిల్లా నాయకులు శ్రీనివాస్ తెలిపారు. ఆటో ఇన్సూరెన్స్ ను రూ.8వేల నుంచి వెయ్యి రూపాయలకు తగ్గించాలన్నారు. మృతిచెందిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.25లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తగ్గేల్లీ బాలరాజు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉమర్ ఖాన్ కార్యదర్శి మహమ్మద్ పాల్గొన్నారు.

