Check Post | చెక్ పోస్ట్ తనిఖీ…

Check Post | నాగర్ కర్నూల్, ఆంధ్రప్ర‌భ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్(Inter District Check Post)ను జిల్లా ఎస్పీ డాక్టర్.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తనిఖీ చేశారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్‌లను పరిశీలించారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, అక్రమ మద్యం, ఇతర నిషేధిత వస్తువుల(prohibited items) రవాణా అయ్యే అవకాశం ఉంటుందని, చెక్‌పోస్ట్ నందు డ్యూటీలో ఉన్న అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ వాహనం, వ్యక్తిని తనిఖీ చేసిన తర్వాతనే వదిలిపెట్టాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏ విధమైన రవాణా జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగించాలని కోరారు.

Leave a Reply