Facilitation Center | స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్

Facilitation Center | స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్

  • ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలి
  • జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

Facilitation Center | జనగామ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వ‌హించాల‌ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Rizwan Basha Sheikh) అన్నారు. ఈ రోజు.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో మొదటి దశ పోలింగ్ కి కావాల్సిన‌ బ్యాలెట్ పత్రాలను సంబంధిత ఎంపీడీఓ లకు అందజేశారు. స్ట్రాంగ్ రూమ్(Strong Room)లో జరిగిన ఈ ప్రక్రియని కలెక్టర్ పరిశీలించారు.

ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మొదటి దశలో చిల్పూర్, ఘనపూర్, రఘునాథపల్లి, జాఫర్గడ్, లింగాల ఘనపూర్ మండలాల్లో జరగనున్న ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ పత్రాల(Ballot Papers)ను, స్టేషనరి సామాగ్రిని సంబంధిత ఎంపీడీవోలకు అందించామన్నారు. ఎంపీడీఓలు తమ మండల పరిధిలో ఎన్నికలు జరగబోయే గ్రామపంచాయితీ వారిగా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యకు ఫారం 9 ఆధారంగా ఆర్ వో -II(R Vo-II) కు ఓటరు జాబితాలోని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కేటాయించాలని సూచించారు.

ఆర్వో – 2 ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఫారం 14 దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం(Facilitation Center) అందుబాటులో ఉంటుందని, మొదట విడత ఎన్నికలు జరిగే 5 మండలాల ఎంపీడీఓ కార్యాలయం యందు ఈనెల 9న వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆ మండలాల్లో ఓటరుగా నమోదైన‌ వారు తమ ఎన్నికల నియామకం పత్రం, ఓటరు గుర్తింపు కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ ను ఫారం 14 కు జత చేసి సంబంధిత ఎన్నికల అధికారి అందజేయాలన్నారు.

Leave a Reply