Retirement | ఎన్నికల విధుల నుండి మినహాయించాలి
- గర్భిణీలు, చంటి పిల్లల తల్లులు
- రిటైర్కు చేరువలో ఉన్నవారికి ఉపశమనం కల్పించాలని డిమాండ్
Retirement | నారాయణపేట ప్రతినిధి ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ప్రస్తుతం జరుగుతున్న విధుల నుండి గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు, ఉద్యోగ విరమణ(Retirement)కు ఆరు నెలల లోపు ఉన్న ఉద్యోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించాలని కోరుతూ పీఆర్టీయూటీఎస్ జిల్లా శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ అధికారి(Project Officer)కి వినతిపత్రం అందజేశారు.
ఈ వర్గాల వారికి ఎన్నికల విధులు మానవతా దృక్పథంలో మినహాయించడం అవసరమని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సజావుగా, నిర్బంధాలు లేకుండా జరిగేలా తాము సహకరిస్తామని కూడా తెలిపారు. వినతిపత్రం(Petition) అందజేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వై.జనార్ధన్ రెడ్డి, నారాయణపేట మండలం అధ్యక్షులు ఎం.రఘువీర్, సి.రాములు, తదితరులు పాల్గొన్నారు.

