Ditwah cyclone | విధ్వంసం..

Ditwah cyclone | విధ్వంసం..

Ditwah cyclone, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లాలో దిత్వా తుఫాను విధ్వంసం సృష్టించింది. జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించి సోమశిల, కండలేరు రిజర్వాయర్లలోని నీటి ద్వారా 7. 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఐఏబీ సమావేశం నిర్ణయించింది. అయితే.. యూరియా కొరత, ధాన్యం మద్దతు ధర లేకపోవడంతో 5 లక్షల ఎకరాల సాగుకే రైతులు పరిమితమయ్యారు. కొన్ని వేల ఎకరాల్లో నారువేతలు పూర్తి అయ్యాయి. మిగిలిన వారు నారు మడులు సిద్దం చేసుకుని ఉన్నారు.

దిత్వా తుఫాను వరి రైతులను చావు దెబ్బ కొట్టింది. భారీ వర్షాలకు నారువేతలన్నీ నీట మునిగాయి. నారు మడులు కుళ్ళిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. రైతులు మరలా వరి విత్తనాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వానలు కొనసాగుతుండడంతో పంట నష్టం అంచనాలు ఇంకా ప్రారంభం కాలేదు. దిత్వా తుఫాను కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా రైతాంగం కోరుతోంది.

Leave a Reply