Congress | సర్పంచ్ బరిలో కటికి కిరణ్ కుమార్

Congress| సర్పంచ్ బరిలో కటికి కిరణ్ కుమార్

  • ప్రజలు ఆదరించి గెలిపించండి

Congress| తల్లాడ, ఆంధ్రప్రభ : మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కటికి కిరణ్ కుమార్ సర్పంచ్ బరిలో ఉన్నారు. మల్లారం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఎన్నికల నియమ నిబంధనలను అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీ(congress party) అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని మల్లారం, గంగాదేవి పాడు(gangadevi paadu) గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు పోయేందుకు సిద్ధమయ్యారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కటికి కిరణ్ కుమార్ ను ప్రజలు ఆదరించి గెలిపించి గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని ఆయన కోరారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(Matta Ragamayi Dayanand), ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. గ్రామంలోని యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామపంచాయతీలో యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిదుల సహకారంతో మల్లారం గ్రామ పంచాయతీ(Mallaram Gram Panchayat)లో నామినేషన్ వేయనున్నారు. ప్రజలు ఆశీర్వదించి అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

Leave a Reply