Association | తెలంగాణ మలిదశ తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి

Association | తెలంగాణ మలిదశ తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి

శ్రీకాంతాచారికి ఘన నివాళులు

Association | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ మలిదశ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి అని, తెలంగాణ నవ నిర్మాణంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాగర్ కర్నూల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అన్నారు. ఆ రోజు తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని(16th birthday) పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా శ్రీకాంతాచారి చూపిన చొరవ ఉద్యమ స్ఫూర్తి పలువురికి స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ రాష్ట్ర(Telangana State) ఏర్పాటులో జరుగుతున్న అడ్డంకులను ఉద్యమకారుడిగా గుర్తించిన శ్రీకాంత్ ఆచారి ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనకు బలిదానం చేసి అమరుడు అయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో శ్రీకాంతాచారి చిరస్థాయిగా నిలిచిపోతాడన్నారు.

రాష్ట్ర సాధనలో శ్రీకాంత్ చారి త్యాగం తెలంగాణ పోరాటానికి దిశా నిర్దేశంగా మారి ఎందరో ఉద్యమకారులను ముందుకు తీసుకువెళ్లే విధంగా చేసింద‌న్నారు. శ్రీకాంతాచారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ఉద్యమంలో భాగస్వాములు కావడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం(Vishwa Brahmin Association) నాయకులు జెపి చారి, పాండు చారి, మన్యం చారి, ప్రతాప్ చారి, అరవింద్ చారి, కేశవా చారి, ప్రసాద్ చారి, సుగుణా చారి, వీర సత్యం చారి, కపిలవాయి శ్రీను, గోపి చారి, వేణు చారి, నరేందర్ చారి, రాజు చారి, విష్ణు చారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply