Model School | ఆర్ధిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన…

Model School | ఆర్ధిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన…

Model School | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌(Telangana Model School)లో ఈ రోజు ఆర్థిక అక్షరాస్యత పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) ప్రతినిధులు నవీన్ సాయి తదితరులు హాజరై తమ అమూల్యమైన సూచనలు, సలహాలు విద్యార్థులకు అందించారు.

బ్యాంకుకు సంబంధించిన సేవింగ్ ఖాతా తెరవడం, ఖాతాను వినియోగించడంతోపాటు ఈమధ్య జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టడంలో విద్యార్థుల పాత్రను వివరించారు.

ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రిన్సిపల్ జి ఉపేందర్ రావు, వాణిజ్య శాస్త్ర ఉపాధ్యాయులు తుమ్మ సతీష్ వివరించారు. విద్యార్థులకు వివిధ అంశాల పైన వ్యాసరచన, బొమ్మలు గీయడం, ఉపన్యసించడం, బృంద కార్యకలాపాలు, క్విజ్ పోటీల(Quiz competitions)ను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply