POLICE | ఫోక్సో కేసు నమోదు

POLICE | ఫోక్సో కేసు నమోదు


POLICE | బయ్యారం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్ (Police Station) లో ఫోక్సో కేసు నమోదైంది. గార్ల, బయ్యారం సిఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి మండల కేంద్రంలోని మరో వీధిలో ఉండే ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తల్లి లేని సమయంలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కూతురుపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక గర్భవతి కావడంతో తల్లి, ఆ వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించారు. ఈ నేపథ్యంలో బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అమ్మాయి తల్లి, ఆ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.

Leave a Reply