Municipal | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని స్థానిక ఆక్స్ ఫర్డ్(Oxford) స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు మున్సిపల్ అధికారులను కోరారు. డిసెంబర్ 2, కాలుష్య నివారణ దినోత్సవం(Pollution Prevention Day) పురస్కరించుకొని మంగళవారం రోజున విద్యార్థులు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్ మాట్లాడుతూ… నిషేధిత ప్లాస్టిక్ ఆరోగ్యానికి హాని(harm) కలిగిస్తుందన్నారు. ముఖ్యంగా కిరాణా, కూరగాయలు, పండ్లు, పాలు తదితర వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ బ్యాగులను వాడటం వల్ల మానవాళి అనేక వ్యాధుల(Many diseases) బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది నమ్ముల ఆనందకుమార్, కె లింగస్వామి, విద్యార్థులు ఉన్నారు.

