మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో పరిష్కరించి న్యాయం అందించడానికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు.
మీకోసం కార్యక్రమానికి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాయుడు ప్రజల వద్ద నుండి ఫిర్యాదుల స్వీకరించారు

