NRI రియాలిటీ మీట్‌ను నిర్వహించిన ASBL..

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ డెవలపర్, హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ఏఎస్ బీఎల్ తమ గ్లోబల్ ఔట్రీచ్ సిరీస్‌లో భాగంగా మధ్యప్రాచ్యంలో దాని ఎన్ఆర్ఐ రియాలిటీ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం మస్కట్, దోహా, అబుదాబి, దుబాయ్‌లలో జరిగింది. ఇది గల్ఫ్ మార్కెట్‌లోకి ఏఎస్ బీఎల్ అధికారిక ప్రవేశాన్ని సూచించటంతో పాటుగా గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీలో అంతర్జాతీయ పెట్టుబడులకు పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.
ఏఎస్ బీఎల్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ అజితేష్ కొరుపోలు ప్రత్యక్ష హాజరయ్యారు. ఆయన అన్ని నగరాల్లో ముఖాముఖి చర్చలకు నాయకత్వం వహించారు. ఈసందర్భంగా ఏఎస్ బీఎల్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ… భారతదేశంలో అత్యంత స్థిరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ నిరంతర ఎదుగుదలను వెల్లడించారు.
ప్రీమియం రెసిడెన్షియల్ మైక్రో-మార్కెట్లలో ఎన్ఆర్ఐ పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నాయని, దీనికి ఉపాధి వృద్ధి, మెరుగైన పట్టణ ప్రణాళిక, బలమైన నియంత్రణ చట్రాలు కారణమని ఆయన వెల్లడించారు. బలమైన అండ్ అత్యంత ప్రభావవంతమైన ఎన్ఆర్ఐ పెట్టుబడిదారుల సంఘాల్లో మధ్యప్రాచ్యం ఒకటన్న ఆయన తమ ఉద్దేశ్యం ప్రాజెక్టులను ప్రదర్శించడమే కాదు, ప్రపంచ భారతీయ కొనుగోలుదారులను పారదర్శకమైన, డేటా-ఆధారిత పరిజ్ఙానంతో శక్తివంతం చేయడమని చెప్పారు.
