CC Camera | సీఎం పర్యటనకు గట్టి భద్రత

CC Camera | సీఎం పర్యటనకు గట్టి భద్రత
ఏలూరు రేంజ్ ఐజీ జీబీజీ.అశోక్ కుమార్
డ్రోన్లతో ఏర్పాట్ల పరిశీలన

CC Camera | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం, గొల్లగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) పర్యటన నేపథ్యంలో సోమవారం ఏలూరు రేంజ్ ఐజీ జీబీజీ. అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

భద్రతా ఏర్పాట్లలో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అత్యాధునిక సీసీ కెమెరాలను, డ్రోన్ కెమెరాలను వినియోగించి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి (Chief Minister) ప్రయాణ మార్గాలను గమనించారు. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను రప్పించి, బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించి, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. అధికారుల సమర్థవంతమైన పర్యవేక్షణ, సిబ్బంది అంకితభావంతో కూడిన సేవలు ఈ పర్యటనలో పోలీస్ అధికారులు అందించారు.

