AP – కోటప్పకొండపై నిప్పు – అగ్నికి చెట్లు ఆహుతి
నరసరావుపేట మండలంలోని కోటప్పకొండపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో కొండపై ఉన్న చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అటవీ శాఖ అధికారులను వివరణ అడగగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారని తెలిపారు మంటలను ఆర్పేందుకు అటవీశాఖ, అగ్ని మాపక సిబ్బంది కొండపైకి వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.