IND vs PAK | షకీల్ హాఫ్ సెంచరీ…
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆసక్తిగా సాగుతోంది. పటిష్ట బౌలింగ్ తో టీమ్ ఇండియా బౌలర్లు పాక్ ను కట్టడి చేస్తున్నారు. అయితే మరోవైపు పాక్ బ్యాటర్లు ఒక్కో పరుగు సాధిస్తూ… నెమ్మదిగా స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ క్రమంలో వన్ డౌన్ లో క్రీజ్ లోకి వచ్చిన సౌద్ షకీల్ (63 బంతుల్లో 4 ఫోర్లు 50) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదేవిధంగా కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (71 బంతుల్లో 3 ఫోర్లు 41) కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. కాగా, ప్రస్తుతం 31 ఓర్లలో పాకిస్థాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులు నమోదు చేసింది.