IND vs PAK | భారత్ బౌలింగ్ కట్టుదిట్టం… 25 ఓవర్లలో పాక్ స్కోరు ఎంతంటే !
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ కు.. భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతుండగా… కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో పాక్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. దీంతో 25 ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది.
కాగా, ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ *(53 బంతుల్లో రెండు ఫోర్లు 24)తో పాటు సౌద్ షకీల్ (47 బంతుల్లో 29) ఉన్నారు.