Karimabad | విద్య వైజ్ఞానిక ప్రదర్శనశాలను సందర్శించిన కలెక్టర్

Karimabad | విద్య వైజ్ఞానిక ప్రదర్శనశాలను సందర్శించిన కలెక్టర్

ప్రతి ఎగ్జిబిట్ మోడల్ ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్


Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా విద్య వైజ్ఞానిక ప్రదర్శనశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద (Dr.Satya Sharada) సందర్శించారు. రెండవ రోజు శుక్రవారం సాయంత్రం సైన్స్ ఫెయిర్ జరుగుతున్న తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ కు కలెక్టర్ రాగా.. డీఈవో రంగయ్య నాయుడు, సైన్స్ అధికారి కట్టా శ్రీనివాసరావు, తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ యజమాన్యం తాళ్ల మల్లేశం, వరుణ్, వంశీ కలెక్టర్ కు స్వాగతం పలికారు.

వారితో కలిసి విద్యార్థులు ప్రదర్శిస్తున్న వైజ్ఞానిక ఆవిష్కరణలను (Scientific discoveries) ఆమె స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రతి ఈవెంట్ మోడల్ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అన్ని ఎగ్జిబిట్లను ఎంతో ఓపికగా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ (Collector) తో ముఖాముఖి మాట్లాడిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఎగ్జిబిట్ ను పరిశీలించి తయారుచేసిన విద్యార్థులను కలెక్టర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. అందుకు సహకరించిన గైడ్ టీచర్లను ఆమె అభినందించారు. ఏర్పాట్లు అన్నింటిని పరిశీలించి.. జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు ఫుడ్ కమిటీతో సమావేశమై ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట మీడియా ఇన్ఛార్జి గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఎల్ సుధాకర్. పర్యవేక్షణ అధికారులు, న్యాయ నిర్ణీతలు పాల్గొన్నారు.

Leave a Reply