suicide | ఏర్గట్ల ఉద్రికత్త!

suicide | ఏర్గట్ల ఉద్రికత్త!
- మృతదేహంతో రాస్తారోకో
suicide | ఏర్గట్ల, ఆంధ్రప్రభ : ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఈ రోజు ఏర్గట్ల తెలంగాణ తల్లి విగ్రహం(Statue of Telangana mother) వద్ద రాస్తారోకో చేసిన సంఘటన ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసం లండన్ నుంచి వచ్చిన దోంచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్(Nagireddy Srikanth) పురుగుల మందు తాగి ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
లండన్‌లో ఉంటున్న దొంచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, అదే గ్రామనికి చెందిన అఖిల ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను నమ్మించి అఖిల మరో యువకునితో పెళ్లి చేసుకుందని మనస్తాపం చెందిన ఈ నెల ఆరో తేదీన పురుగుల మందును శ్రీకాంత్ రెడ్డి తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థత(Critical Illness)కు గురైన ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న శ్రీకాంత్ మృతి చెందాడు. పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, తమకు న్యాయం చేయాలని దొంచంద నుంచి మృతదేహంతో ఏర్గట్ల వచ్చిన వారు రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, దొంచంద బాధితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి చేరుకుని బాధితులతో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


