Medak | పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం..

Medak | పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం..
మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్
Medak | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారత ప్రథమ సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు, మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ (Medak) మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ (Former Municipal Chairman Mallikarjun Goud) పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా మెదక్ (Medak) పట్టణ పార్టీ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులు, మార్కెట్ మాజీ చైర్మన్ కృష్ణ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలసి మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… సమ సమాజ స్థాపనకు, బడుగ, బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ముందంజ వేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyotirao Phule) ఎంతో కృషి చేశారన్నారు. నవనిర్మాణ వెనుకబడిన జాతుల వారి కోసం పోరాటం చేసిన సమరయోధుడు మహాత్మజ్యోతిరావుపూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు భీమరి కిషోర్, జయరాజ్, ఆర్కె శ్రీనివాస్, మాయ మల్లేశం, నాయకులు లింగారెడ్డి, ప్రభురెడ్డి, మోచి కిషన్, జుబెర్ అహ్మద్, మోహన్ నాయక్, రుక్మచారి తదితరులు పాల్గొన్నారు.
