division | రెవెన్యూ డివిజన్‌గా బనగానపల్లి

division | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని బనగానపల్లిని నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని 30 రోజుల లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆమె సూచించారు. గెజిట్ నోటిఫికేషన్‌ను అన్ని గ్రామ సచివాలయాలు, మండల కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో ప్రచురించేందుకు చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా.. ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేసినట్లు తెలిపారు.

Leave a Reply