AP assembly| బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్న జగన్
వెలగపూడి – మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు .
అయితే గత ఎలక్షన్ లో ఓడిన తర్వాత నుండి. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరు కాలేదు అనేది మన అందరికి తెలిసిందే.ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలవడంతో.. వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది లేకుండా పోయింది. అయినా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసారు. కానీ అది జరగలేదు. అందువల్ల అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
కానీ తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని అధిష్ఠానం ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 24న ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు.. అనంతరం వారితో కలిసి శాసన సభ కు వెళ్లనున్నారు.