మహా కుంభమేళాలో తమన్నా..

  • ఒడెలా 2 టీజర్ విడుద‌ల

ఉత్తరప్రదేశ్ : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు మిల్కీ బ్యూటీ తమన్నా హాజరయ్యారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లిన తమన్నా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి.. కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

తమన్నా తాజా చిత్రం ‘ఒడెలా 2’. ‘ఒదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి అశోక్‌ తేజ దర్శకత్వం వహించగా, మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మహా కుంభమేళాలో లాంచ్ చేశారు మేక‌ర్స్. ఇలాంటి మహా కుంభమేళాలో లాంచ్‌ కానున్న మొట్టమొదటి టీజర్‌ ‘ఓదెల 2’ కావడం విశేషం.

ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుండ‌గా.. ‘కాంతార’ ఫేం అజనీష్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తారు.

Leave a Reply