Gold Rates | ప‌సిడి ప్రియుల‌కు షాక్‌

Gold Rates | ప‌సిడి ప్రియుల‌కు షాక్‌

  • అమ్మో.. ఒకేసారి ఇంత పెరిగిందా?

Gold Rates | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మూఢం ప్రారంభ‌మైతే బంగారం రేట్లు త‌గ్గుతాయ‌ని భావించిన ప‌సిడి ప్రియుల‌కు ఈ రోజు బంగారం ధ‌ర‌లు చూసి షాక్ తిన్నారు. రెండు రోజుల్లో ప‌ది గ్రాముల 24కే బంగారం రూ. 2,780, 22కే రూ. 2,550లు పెరిగింది. అలాగే కిలో వెండి ధర కూడా రూ. 6,000 పెరిగింది. వీటి ధ‌ర‌లు(prices) పెరగడానికి యూఎస్‌ ఆర్థిక డేటా విడుదల ఆలస్యం కావడం ఒక కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇది డిసెంబర్ పాలసీలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్(US Federal Reserve) నుండి రేటు తగ్గింపు ఆశలను పునరుద్ఘాటించింది. డిసెంబర్‌లో ఫెడ్ రేటు కోత అంచనాలను పెంచడంతో బంగారం, వెండి రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మరో కీలకమైన అంశం… డాలర్ ఇండెక్స్(Dollar Index) 100 కంటే దిగువకు పడిపోయింది,.ఇది బులియన్‌కు అదనపు మద్దతును ఇచ్చింది.

ఈ రోజు దేశంలో బంగారం ధ‌ర‌లు పెరిగింది. బంగారం(Gold) (24కే) ఒక గ్రాము 12,791 రూపాయ‌లు కాగా, 22కే ఒక గ్రాము ధ‌ర 11,725 రూపాయలు. నిన్న బంగారం (24కే) ఒక గ్రాము 12,704 రూపాయ‌లు కాగా, నిన్నంటి కంటే ఈ రోజు రూ.87లు పెరిగింది. అలాగే నిన్న‌ 22కే ఒక గ్రాము ధ‌ర 11,725 రూపాయలు అంటే రూ.80లు పెరిగింది.

ప‌ది రోజుల ధ‌ర‌లు వివ‌రాలు (ఒక గ్రాము ధ‌ర‌)

24కే 22కే
నవంబర్ 26, 2025 రూ.12,791 (+87) రూ.11,725 (+80)
నవంబర్ 25, 2025 రూ.12,704 (+191) రూ.11,645 (+175)
నవంబర్ 24, 2025 రూ.12,513 (-71) రూ.11,470 (-65)
నవంబర్ 23, 2025 రూ.12,584 (0) రూ.11,535 (0)
నవంబర్ 22, 2025 రూ.12,584 (+186) రూ.11,535 (+170)
నవంబర్ 21, 2025 రూ.12,398 (-28) రూ.11,365 (-25)
నవంబర్ 20, 2025 రూ.12,426 (-60) రూ.11,390 (-55)
నవంబర్ 19, 2025 రూ.12,486 (+120) రూ.11,445 (+110)
నవంబర్ 18, 2025 రూ.12,366 (-174) రూ.11,335 (-160)
నవంబర్ 17, 2025 రూ.12,540 (+32) రూ.11,495 (+30)

Leave a Reply