Ootkur | రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

Ootkur | రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) రచించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఊట్కూర్ (Ootkur) మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొక్కు శంకర్, మాజీ జెడ్పిటిసి సూర్య ప్రకాశ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా జోగిని వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ హాజమ్మ అన్నారు.

బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ (Ootkur) మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగం ఆమోదించి 69 ఏళ్లు పూర్తి కావడంతో రాజ్యాంగ సవరణ హక్కులను గుర్తుచేసుకొని రాజ్యాంగ పీటికను చదివారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) పొందు పరిచిన రాజ్యాదేశంలో పుట్టిన కుల, మత బేధాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన హక్కులను కల్పించారని అన్నారు. ఎస్సీ, ఎస్ టి, బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలందరికి ఆణువణువూనా భారత రాజ్యాంగం రక్షణగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో బీజేవైఎం (BJYM) దళిత మోర్చా అధ్యక్షులు ఎం. విజయకుమార్, అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి కొండన్ భరత్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్, మాజీ ఎంపీటీసీ హన్మంతు, సామజిక కార్యకర్తలు నర్సిములు, వర్ష, భారతి, బహుజన సమాజ్ పార్టీ మండల ఇంచార్జి కొక్కు గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply