College | 29న భీమవరంలో జాబ్‌మేళా

College | 29న భీమవరంలో జాబ్‌మేళా
- నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే అంజిబాబు
College | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఈ నెల 29న భీమవరం ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల(SR KR Engineering College)లో జరిగే జాబ్ మేళాను భీమవరం నియోజక వర్గంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(MLA Pulaparthi Ramanjaneyulu) (అంజిబాబు) అన్నారు.
ఈ రోజు భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మాట్లాడారు. ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే భీమవరం ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 28 ప్రముఖ కంపెనీల(28 leading companies)తోపాటు మరికొన్ని ఇతర కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.
వివిధ కంపెనీలలో మొత్తం 3 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని, 18 – 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరెన్ని వివరాలకు ఈ నెంబర్లను 86885 95244, 95020 24765 సంప్రదించవచ్చునని ఎమ్మెల్యే సూచించారు.
