NBK 111 | బాలయ్య కొత్త సినిమా ప్రారంభం..

NBK 111 | బాలయ్య కొత్త సినిమా ప్రారంభం..

NBK 111, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా సక్సెస్ సాధించి కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా దూసుకెళుతున్నారు. ప్రస్తుతం అఖండ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిన అఖండ 2 (AKHANDA 2) డిసెంబర్ 5న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో.. అఖండ 2 సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈరోజు బాలయ్య కొత్త సినిమా ప్రారంభించారు. దీనికి మలినేని గోపీచంద్ దర్శకుడు. గతంలో బాలయ్య, మలినేని గోపీచంద్ (Malineni Gopichand) కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా రావడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలసి మరో సినిమా చేస్తుండడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్.బి.కే 111 మూవీగా రూపొందే ఈ సినిమా హిస్టారిక్ మూవీగా తెరకెక్కనుందని.. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని మేకర్స్ అఫీషియల్ గా తెలియచేశారు. ఇందులో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. ఈ మూవీ ఓపెనింగ్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.

Leave a Reply